KNR: హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. ప్రధానంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమ అమలు తీరుపై ఈ సమావేశంలో చర్చించారు.