SRPT: మోతే మండల కేంద్రంలో లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా మహిళలు, పురుషులాడిన కోలాటం విశేషంగా అలరించింది. గ్రామీణ కళాకారులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ఆటను ప్రదర్శించారు.