Parties are asked YASH to campaign in elections but
Parties are asked YASH:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినర్ల కోసం చూస్తున్నాయి. అధికార బీజేపీ (bjp) తరఫున ప్రచారం చేస్తానని కిచ్చ సుదీప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేజీఎఫ్ ఫేమ్ యష్ (yash) ప్రచారం కోసం.. మిగిలిన పార్టీలు ఆరాట పడుతున్నాయి. కాంగ్రెస్ (congress), జేడీఎస్ (jds).. యష్‌ను (yash) ప్రచారం చేయాలని సంప్రదించాయని తెలిసింది. కానీ అతను మాత్రం తాను క్యాంపెయిన్ చేయను, చేయబోనని తేల్చిచెప్పారట.
భవిష్యత్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేశానని.. పార్టీల కోసం ప్రచారం చేయనని యష్ (yash) చెప్పారట. పార్టీలు ఇచ్చిన ఆఫర్ (offer) సున్నితంగానే తిరస్కరించారని తెలిసింది. ఏప్రిల్ నెలాఖరులోగా కొత్త సినిమాల ప్రకటన ఉంటుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) కూడా యశ్‌తో (yash) మూవీ తీస్తానని ప్రకటించారు. గత ఎన్నికల్లో మాత్రం కొందరు అభ్యర్థుల కోసం యష్ (yash) క్యాంపెయిన్ చేశారు. మాండ్యాలో చివరి రోజు వరకు దర్శన్‌తో (darshan) కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
కేజీఎఫ్ మూవీతో (kgf) యష్ (yash) జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించింది. కేజీఎఫ్ సిరీస్ రెండు మూవీస్ సక్సెస్ అయ్యాయి. యష్ (yash) చేత ప్రచారం చేయిస్తే కర్ణాటకలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు కనెక్ట్ అవుతాయని.. ఓటు బ్యాంక్ పెరుగుతుందని పార్టీలు భావించాయి. కానీ వాటి ఆశలపై యష్ నీళ్లు చల్లారు.
ఇటు కాంతారా (kantara) ఫేమ్ రిషబ్ షెట్టిని (rishan shetty) కూడా ప్రచారం చేయాలని పార్టీలు కోరాయట. ఆయన కూడా నో అని చెప్పారట. సుదీప్ (sudeep) మాత్రమే కర్ణాటక ఎన్నికల ప్రచార కదనరంగంలోకి దిగారు. బీజేపీ తరఫున ఆయన క్యాంపెయిన్ చేస్తారు.