TG: డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురానుంది. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మెంబర్ చనిపోతే దాన్ని ఫ్యామిలీ చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి మహిళల రుణానికీ బీమా స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకుకు చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి రూ.10 లక్షల బీమా కూడా ఉంటుంది. ఈ బీమా సొమ్మునూ ప్రభుత్వమే చెల్లిస్తుంది.