WNP: జిల్లా కేంద్రంలో మార్చి 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ సర్పంచులకు, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మాన కార్యక్రమం ఉంటుందని జాతీయ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రానున్నారని అన్నారు. అందుకు సంబంధించిన గోడపత్రికను మంగళవారం జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విడుదల చేశారు.