»Successes Are Possible Only By Facing Failures Pawan
Warangal Nit : పరాజయాలు ఎదుర్కొంటేనే విజయాలు సాధ్యం – పవన్
వరంగల్ నిట్(Warangal Nit) 2023 వసంతోత్సవ వేడుకలను జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లలేదని, తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకోవడానికి వచ్చానని పవన్ వెల్లడించారు
వరంగల్ నిట్(Warangal Nit) 2023 వసంతోత్సవ వేడుకలను జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాను ఇప్పటివరకు విద్యాసంస్థల కార్యక్రమాలకు వెళ్లలేదని, తన జీవితంలోని కొన్ని సంఘటనలను మీతో పంచుకోవడానికి వచ్చానని పవన్ వెల్లడించారు. మూడురోజుల పాటు జరిగే వరంగల్ నిట్ 2023 వసంతోత్సవ వేడుకలను ఆయన పాల్గోన్నారు. బాల్యంలో లియొనార్డో డావిన్సి(Leonardo da Vinci) తన రోల్ మోడల్ అని పవన్ తెలిపారు. ఇంటర్ పరీక్షల సమయంలో తన స్నేహితులు స్లిప్స్ తీసుకెళ్లేవారని ఫన్నీగా గుర్తుచేసుకున్నారు. ఫెయిలైనా సరే కాపీ కొట్టకూడదని తాను భావించేవాడ్నని వివరించారు. తాను ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యానని, కానీ నైతికంగా విజయం సాధించానన్నారు.
నెహ్రూ ఎంతో ముందుచూపుతో ఎన్ఐటీలను ప్రారంభించారని కీర్తించారు. మీ సామర్థ్యానికి తగిన ఉద్యోగాలు రావాలని ఆకాంక్షిస్తున్నానని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పరాజయాలు (defeats)ఎదుర్కొంటేనే విజయాలు సాధ్యమని అన్నారు. ఇవాళ నేను విఫలం కావొచ్చు.. రేపు విజయం సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. కళ ఏ రాష్ట్రానికి చెందినవారినైనా కలుపుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనందరినీ కలిపేది సంస్కృతి(culture) ఒక్కటేనని అన్నారు. మానవత్వం అనేది మనుషులను ఏకం చేస్తుందని తెలిపారు. నాటు నాటు పాటకు(Natu Natu song) ప్రాంతాలకు అతీతంగా పాదం కదిపారని వివరించారు.