RS Praveen Kumar : పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా... బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు.
పదో తరగతి ప్రశ్నా ప్రతాలు లీకైన వ్యవహారంలో బీజేపీ నేత బండి సంజయ్ ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా… బండి సంజయ్ పై తాజాగా బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్ చేశారు. ఈ కేసులో సంజయ్ ను విడిచిపెట్టవద్దన్నారు. మునుపటి నేరాలకు సంబంధించి ఆయనపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలన్నారు. అధికారం కోసం బిజెపి ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు.
‘ఈ కేసులో వరంగల్ సీపీ అద్భుతంగా విచారణ చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. బండి సంజయ్‌ని జైలు నుంచి విడుదల చేయకూడదు. ఈ కుట్రతో పాటు ఇతర మునుపటి నేరాలకు (ఇంకా ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు కాలేదు) ఆయనను పీడీ చట్టం కింద నిర్బంధించాలి. తరచూ నేరాలు చేసే వారిని, నిజాయతీ లేని, అవినీతి రాజకీయ నాయకుల నుంచి తెలంగాణను కాపాడాలని నేను కోరుతున్నాను’ అని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.