ATP: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న మొహర్రం వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీర్ల స్వాములకు చక్కెర చదివించి మొక్కులు తీర్చుకున్నారు. ముజావర్లు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అనంతరం ఆమె గ్రామ నాయకులతో సమావేశమయ్యారు.