TPT: తిరుపతి జిల్లా పోలీసు సిబ్బందికి అమరా హాస్పిటల్, కాంటినెంటల్ కాఫీ (ఇండియా) లిమిటెడ్, అమరరాజా గ్రూప్స్ సహకారంతో మూడు రోజుల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. బీపీ, ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోలీసుల సేవలు అమూల్యమని, ఆరోగ్య పరిరక్షణకు ముందస్తు పరీక్షలు అవసరమని డాక్టర్ రమాదేవి అన్నారు.