సత్యసాయి: రాష్ట్ర ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. హైదరాబాద్-బెంగళూరు ఇండిస్టియల్ కారిడార్ పరిధిలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక స్పేస్ సిటీని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఇది అంతరిక్ష రంగంలో పరిశోధన, డిజైన్, ఆవిష్కరణ, నమూనాల తయారీకి కేంద్రంగా మారుతుందని పేర్కొంది.