NTR: రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 29 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.