కృష్ణా: జిల్లాకు చెందిన పలువురు ఏఎన్ఎంలు ప్రమోషన్ల కోసం నకిలీ క్లినికల్ టెస్టింగ్ సర్టిఫికెట్లు సమర్పించారు. నరసరావుపేటలోని ఓ కాలేజీలో ఇంటర్న్షిప్ చేయకుండానే వీటిని పొందినట్లు వైద్యశాఖ గుర్తించింది. ఈ ఘటనపై జిల్లా డీఎంహెచ్ఓ శర్మిష్ఠ ఏఎన్ఎంలకు నోటీసులు జారీ చేశారు. సదరు కాలేజీని సంప్రదించగా, ఈ సర్టిఫికెట్లు నకిలీవని తేలిందన్నారు.