జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ తన ఉదారతను చాటుకున్నాడు. జగిత్యాల-కడెం బస్సు శనివారం కడెంకు బయలుదేరింది. తిరిగి జగిత్యాలకు వస్తుండగా బుట్టాపూర్లో బస్సు ఎక్కిన దుర్గం శామ్యూల్ అనే వ్యక్తి బ్యాగును బస్సులోనే మర్చిపోయి దిగాడు. గమనించిన కండక్టర్ సుంకరపెల్లి అశోక్ బ్యాగులో రూ.27 వేలు ఉన్నట్లుగా గుర్తించి సంబంధిత వ్యక్తికి సమాచారం అందించాడు.