PPM: పాచిపెంట మండలం కర్రివలస గ్రామానికి బస్సు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 400 కుటుంబాలు నివసిస్తుండగా.. నిత్యం రైతులు, విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. బస్ షెల్టర్ లేకపోవడంతో రోడ్డుమీద వేచి ఉండాల్సి వస్తుందని స్థానికి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బస్ షెల్టర్ నిర్మించాలని కోరుతున్నారు.