NZB: వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి బుధవారం సాయంత్రం కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు.