విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం వారి స్వగ్రామం VN పురంలో కుటుంబ సభ్యులు, పురప్రజల సమక్షంలో వినాయక చతుర్థి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహా గణపతి ప్రతిమకు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, పాడి పంటలతో,అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.