NLR: ఉదయగిరి MRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను సెప్టెంబర్ 1వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ నారాయణస్వామి పేర్కొన్నారు. BSC మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ, BA ఎకనామిక్స్, హిస్టరీ, B.com కంప్యూటర్ అప్లికేషన్, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాల పనివేళల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.