BHNG: బాలకార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఈ నెల 31 వరకు ఆపరేషన్ ముస్కాను జిల్లాలో పకడ్బందీగా, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. మహిళా శిశు సంక్షేమ, పోలీస్, కార్మిక, విద్యా, వైద్యశాఖలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.