AP: శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం కలుషితమై 17 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వాంతులు, విరేచనాలతోపాటు తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినులకు వసతి గృహంలోనే ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.