HYD: త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉప్పల్ నల్ల చెరువు, పాతబస్తీలోని బమృక్ దౌలా చెరువు, మాధాపూర్ సున్నం చెరువు, తమ్మిడికుంట అందుబాటులోకి వస్తాయని హైడ్రా తెలియజేసింది. అంతేకాక రాబోయే కొద్ది నెలలలోనే రెండో విడతగా మరో 13 చెరువుల అభివృద్ధిని చేపడతామని హైడ్రా పేర్కొంది. చెరువుల పునరుద్ధరణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా వివరించింది.