W.G: వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి రంగనాథరాజు ఆదేశాల మేరకు ఆచంట మండలం శేషమ్మ చెరువు వైసీపీ గ్రామ కమిటీ బుధవారం నియమించారు. గ్రామ అధ్యక్షుడిగా కడలి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడిగా జోసెఫ్, ఇంకా 17 మంది సభ్యులను ఎంపిక చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు మాజీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.