TPT: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను ఆశీర్వదించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై స్వామివారు విహరించారు.