ప్రకాశం: మద్దిపాడు మండలంలోని గార్లపేటలోనీ పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం సందర్శించారు. వేలం కేంద్రంలో పొగాకు అమ్మకాలను ఆమె పరిశీలించారు. వేలం నిర్వహణ అధికారి శ్రీనివాస్‌తో మాట్లాడి ధరలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.