SRPT: నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మంగళవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోదాడ నియోజకవర్గ డాక్టర్లకు జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వైద్యం అంటే వృత్తిగా కాకుండా, మనుషులను బతికించే మహాశక్తిగా భావించాలన్నారు. ప్రజలకు సేవలు అందిస్తున్న డాక్టర్లకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.