ADB: వినాయక చవితి సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బుధవారం పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళు, వినాయక ప్రతిమలు తయారు చేసే ప్రదేశాలు, సమస్యాత్మక ప్రాంతాలను స్వయంగా సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సిబ్బందికి సూచనలు చేసి, అధికారులకు తగిన దిశానిర్దేశం చేశారు.