MBNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన సంఘ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీలకు అధ్యక్ష పదవిని ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అధిక జనాభా బీసీలు ఉంటారని పేర్కొన్నారు.