తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.
తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్(Bandi Sanjay)ను ఏ1గా చేర్చుతూ పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఏ-2గా బూర ప్రశాంత్, ఏ-3గా మహేష్ గండబోయిన, ఏ-5గా శివగణేష్ ను పేర్కొన్నారు. పోగు సుభాష్, పోగు శశాంక్, శ్రీకాంత్, షర్మిక్, వర్షిత్లను ఏ-10 వరకు చేర్చారు. కానీ రిమాండ్ రిపోర్టులో ఏ-4 ఎవరనేది పేర్కొనలేదు. ఎఫ్ఐఆర్ ప్రకారం సీఆర్పీసీ 154, 157 సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేశారు.
SSC పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసేందుకు బండి సంజయ్ కుమార్ ప్రశాంత్, మహేశ్‌లతో కలిసి కుట్ర పన్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. పేపర్ ఎలా లీక్ చేయాలనే విషయమై బండి సంజయ్ ఏ-3 మహేశ్‌తో వాట్సాప్‌లో చర్చించినట్లు పోలీసులు చెబుతున్నారు. కమలాపాపూర్ టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టే క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన వాహనంపై దాడి చేశారు. 10వ తరగతి పేపర్ల లీకేజీలో కుట్రదారుడిగా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి.. హన్మకొండ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు సంజయ్‌కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. బండిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. పోలీసు వాహనం ఎక్కి అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు.