ATP: గుంతకల్లు పట్టణ శివారులోని వినాయక ఘాట్‌ను బుధవారం మున్సిపల్ కమిషనర్ నయుం అహ్మద్ పరిశీలించారు. గణేశ్ నిమజ్జనం రోజున నీటి మట్టాలు, లైటింగ్, పార్కింగ్, క్రేన్ల ఏర్పాట్లు, రోడ్లు మరమ్మతులు, దారి మళ్లింపుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిమజ్జనం ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.