HYD: బిగెస్ట్ పండుగ గణేశ్ ఉత్సవాలు షురూ అయ్యాయి. HYD జిల్లా వ్యాప్తంగా పూలు, పండ్లు, ఇతర పూజ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. చామంతి పూలు కేజీ రూ. 600-800 మధ్య ఉన్నాయి. బంతిపూలు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, అరటి డజన్ రూ.40- 60కి పెంచారు. బత్తాయి, యాపిల్, దానిమ్మ, జామ వంటి పూజలో ఉపయోగించే పండ్ల ధరలు రెట్టింపు చేశారు.