NZB: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో మట్టి గణపతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.