»Gold Price At All Time High On April 5th 2023 Possibility Of Reaching 65000 Soon
Gold price: ఆల్ టైం గరిష్టానికి గోల్డ్ ధర…త్వరలో 65 వేలకు చేరే అవకాశం!
దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు(gold rates) బుధవారం(ఏప్రిల్ 5న) పెద్ద ఎత్తున పెరిగాయి. గ్రాముకు వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61 వేలను దాటేసింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు(gold prices) బగ్గుమంటున్నాయి. ఈరోజు(ఏప్రిల్ 5న) ఒక్కసారిగా పసిడి రేట్లు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే గ్రాముకు దాదాపు వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా పెరిగి మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్లో(hyderabad) బుధవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,030 పెరిగి రూ.61,360కి చేరింది. ఇదిలా ఉండగా 22 క్యారెట్ల బంగారం(gold) ధర రూ.56,350గా ఉంది. ఇది రూ.950 పైకి ఎగబాకింది. మరోవైపు చెన్నై(chennai)లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,070కి ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,900గా ఉంది. ఇంకోవైపు దేశ రాజధాని ఢిల్లీ(delhi), జైపూర్, చంఢీగఢ్ ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.61,510కి ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,400గా ఉంది.
ఆర్థిక అనిశ్చితితో సహా వివిధ కారణాలతో హైదరాబాద్(hyderabad)తోపాటు ఇతర భారతీయ నగరాల్లో కూడా గోల్డ్ ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు బంగారం ధరలకు బెంచ్మార్క్ కరెన్సీగా పరిగణించబడే యుఎస్ డాలర్ ఇటీవలి కాలంలో హెచ్చుతగ్గులకు లోనవుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు పెరిగాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి కోలుకోవడానికి కష్టపడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు చమురు ధరల పెరుగుదల, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకోవడం వంటివి పసిడి రేటు పెరిగేందుకు దోహదం చేశాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో గోల్డ్ రేటు రూ.65,000కు చేరుకోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ పెరుగుదల మంచుకొండ మాత్రమేనని…త్వరలో తగ్గుతుందని ఇంకొంత మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే పెళ్లిళ్ల సీజన్ నాటికి తగ్గుతుందని కొంత మంది చెబుతుండగా..రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మాత్రం పెరగడమే కానీ తగ్గదని అంటున్నారు.