»Gold Price Gold Price Cross Rs 60000 Mark For First Time
Gold Price: బంగారం కొనేవారికి షాక్.. భారీగా పెరిగిన ధర
బంగారం(Gold) కొనాలనుకునేవారికి ఇది షాకింగ్ వార్తే. బంగారం ధర(Gold Rate) రికార్డు స్థాయిలో రూ.60 వేల మార్కును దాటడంతో బంగారం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది బంగారం కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం(Gold) ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో బంగారం ధర(Gold Rates) ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1600పైగా పెరిగింది. దీంతో బంగారం ధర రూ.60,320కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1500పైగా పెరిగింది. దీంతో దాని ధర రూ.55,300కి చేరింది.
గత మూడు రోజుల్లో బంగారం ధర(Gold Rates) దాదాపుగా రూ.2500 వరకూ పెరిగినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధర(Silver Price) కూడా పెరిగింది. ఒకేరోజు వెండి ధర రూ.1300 పెరిగి కిలో వెండి రూ.74,400కు చేరింది. మరోవైపు ఈ నెలలోనే బంగారం ధర(Gold Price) పది గ్రాములకు రూ.65 వేల వరకూ చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు.