Yamuna level at all-time high, water enters city, Arvind Kejriwal calls meeting
Yamuna: యుమునా (Yamuna) నదీ వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఈ రోజు 207.55 మీటర్లకి వరద ఉధృతి చేరింది. 1978 తర్వాత ఈ మార్క్ దాటింది. అప్పుడు 207.49 మీటర్లకు చేరగా.. ఇప్పుడు ఆ స్థాయి దాటింది. యమునా వరద ఉధృతి పెరగడంతో ఢిల్లీలోకి వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.
యమునా ఉగ్రరూపం
ఉత్తరాదిలో కురుస్తోన్న వర్షాలతో ఢిల్లీ సమీపంలో గల యమునా (Yamuna) నది మహోగ్రరూపం దాల్చింది. 45 ఏళ్ల క్రితం నాటి రికార్డును దాటి ఆల్ టైం గరిష్టానికి చేరింది. ఢిల్లీ కాలనీల్లోకి వరదనీరు చేరింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జీ వద్ద యమునా (Yamuna) నదీ నీటిమట్టం 207.55 మీటర్లకు చేరింది. హర్యానా నుంచి నీరు విడుదల చేయడంతో ఢిల్లీలో యమునా నదీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. యుమునా (Yamuna) నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా… ఆ మార్క్ రెండురోజుల క్రితమే దాటింది. 2013 తర్వాత బుధవారం ఉదయం 207 మార్క్‌ను తాకింది.
Yamuna (Delhi Railway Bridge) Water Level reached 207.25 mtrs at 8:00am
— Weatherman Shubham (@shubhamtorres09) July 12, 2023
జోక్యం చేసుకొండి
గత రెండురోజుల నుంచి ఢిల్లీలో వర్షం కురవలేదు. అయినప్పటికీ నదీజలాలు పెరుగుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. హర్యానా హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేయడమే ఇందుకు కారణం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యమునా (Yamuna) నీటి స్థాయి పెరగకుండా జోక్యం చేసుకోవాలని కోరారు. 1978లో యుమునా నది నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీలో భారీ వరదలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డు దాటడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరప్రాంతంలో గల లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారు. కొన్ని కాలనీల్లోకి వరద నీరు వచ్చింది. ఇళ్లు, మార్కెట్లలోకి నీరు చేరింది.
"In the last nine years, AAP govt didn't spend a single penny on infrastructure and only did politics of freebies," says BJP MP Gautam Gambhir after visiting a relief camp in Delhi amid rising water levels of Yamuna#KejriwalCopiesGambhirpic.twitter.com/TSW74xVZo7
— Gauti Harshit Dhiman (GG Ka Parivar) (@GautiDhiman) July 12, 2023
కేజ్రీవాల్ సమీక్ష
వరద పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం అయ్యారు. వరద ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు.
Rain News Today Live: Delhi on alert as Yamuna water level reaches highest level in 45 years; Section 144 in flood-prone areas https://t.co/7aXAkr1nIU
— K.RAGAVAN..(ModiKA PARIVAR) (@write2ragavan) July 12, 2023