Minister Koppula Eshwar ఆరోపణలు..! పేపర్ లీక్ లో బండి పాత్ర..
Minister Koppula Eshwar : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ఎట్టకేలకు పోలీసులు ధృవీకరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే 5 సెక్షన్ల కింద బండిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ఎట్టకేలకు పోలీసులు ధృవీకరించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, వాట్సాప్ లలో ప్రచారం అంశంలో ఆయన హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే 5 సెక్షన్ల కింద బండిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తుండగా… బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తున్నారు. కాగా.. ఈ విషయంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు.
బీజేపీ నేతలపై కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీ అవలంభిస్తున్న పద్ధతులు ఇదివరకు ఎప్పుడూ చూడలేదని అన్నారు. బీజేపీ అధికార దాహంతో ఉందని.. ఇందుకోసం ఎంత నీచానికైనా దిగజారుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకులు, పేపర్ అవుట్లు ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. దీన్ని తెలంగాణ ప్రజానీకం ఖండించాలన్నారు. ప్రజావ్యతిరేక చర్యలు చేస్తున్న బండి సంజయ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.