TPT: వినాయక చవితి సందర్భంగా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆది దేవుడైన వినాయకుడు సర్వ విఘ్నాలను తొలగించి ప్రజలకు మంచి చేకూర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని, మట్టి గణపతిని పూజించాలని కోరారు.