SKLM: అధిక వర్ష ప్రభావం వలన నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. మంగళవారం పెదపాడు నుంచి సింగపురం వరకు నడిచి వెళ్లారు. నేషనల్ హైవే మీద నీరు నిల్వ ఉండటంతో హైవే అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి విపత్తులు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా చర్యలు చేపడతామన్నారు.