చిత్తూరు: ఐరాల మండలం కాణిపాకంలో వెలసిన శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని రద్దు చేసినట్లు చెప్పారు. భక్తులు దేవస్థానం వారికి సహకరించాలని ఆయన కోరారు.