BDK: సుజాతనగర్ మండలంలోని రైతు వేదికలో సింగభూపాలెం, గరీబ్‌పేట, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ గ్రామపంచాయతీలకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు.