SRPT: మోతే మండలంలోని రత్యాల కుంట చెరువు కట్టపై గంజాయి దాచిపెట్టారనే విశ్వసనీయ సమాచారంతో మోతే ఎస్సై, సిబ్బంది మాటు వేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితులు ఒడిశాకు చెందిన వ్యక్తులుగా గుర్తించామన్నారు.