SRPT: సూర్యాపేట జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయానికి ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి సూర్యాపేటలోని రెడ్డి హాస్టల్లో తాత్కాలికంగా స్కూలును ప్రారంభిస్తున్నారు. వచ్చే ఏడాది కోదాడలో పర్మినెంట్ బిల్డింగ్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలం కోసం ఇటీవల ఆఫీసర్లు సర్వే చేపట్టారు. ఇప్పటికే ఆరో తరగతిలో ఎంట్రెన్స్ కోసం టెస్ట్ నిర్వహించారు.