అన్నమయ్య: అంతర్రాష్ట్ర బైక్ దొంగ షేక్ ఆరిఫ్‌ను పీలేరు పోలీసులు అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.40 లక్షల విలువైన 24 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన ముగ్గురు రిసీవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం వెల్లడించారు. ప్రజలు వాహనాల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.