NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 37.180 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 3000 క్యూసెక్కులు, కావలి కెనాల్‌కు 850 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.