VSP: గాజువాక 76వ వార్డులోని ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం ఒక ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.