TPT: నగరి నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అన్నారు. పుత్తూరులో సోమవారం ముద్దుకృష్ణమ నాయుడు జయంతిని నిర్వహించారు. అంబేడ్కర్ కూడలి వద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. తండ్రి వారసత్వంగా నగరి ప్రజల కోసం తాను ఎల్లవేళలా పనిచేస్తానని స్పష్టం చేశారు.