SKLM: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 9న జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో యోగా ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. జిల్లా అన్ని శాఖల అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, పౌరులు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.