AP: సాక్షి మీడియాలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆడబిడ్డలను అవమానించేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు క్షమించరాని నేరమన్నారు. రాజకీయ, మీడియా ముసుగులో వికృత పోకడలు చేస్తున్నారని మండిపడ్డారు.