»Hindhi Paper Leak In Warangal Not A Paper Leak Warangal Cp Ranganath
Warangal CP Ranganath: ఇది పేపర్ లీక్ కాదు
ఈరోజు వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ లీక్ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) రియాక్ట్ అయ్యారు. ప్రశ్నపత్రం గంటన్నర తర్వాత వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఆ క్రమంలో అది పేపర్ లీక్ అయినట్లు కాదన్నారు.
నిన్న 10వ తరగతి తెలుగు పశ్నాపత్రం లీకవగా..ఈరోజు మంగళవారం హిందీ ప్రశ్నాపత్రం (Hindi Exam) లీక్ అయింది. వరంగల్ జిల్లాలో (Warangal District) ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు తెలిసింది. లీకైన పేపర్ వాట్సాప్ గ్రూపులలో షేర్ అయినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించిన అధికారులు ఇది లీక్ కాదు సర్క్యులేట్ మాత్రమే అని చెబుతున్నారు. మరోవైపు ఈ లీకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్(Warangal CP Ranganath) స్పందించారు. పరీక్ష మొదలైన గంటన్నర తర్వాత పేపర్ బయటకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో అది లీక్ కిందకు రాదని అన్నారు. వాట్సాప్ లో క్వశ్చన్ పేపర్ లోకేషన్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనలపై సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. ఇంకోవైపు తమ ప్రాంతాల్లో పేపర్ లీక్ కాలేదని వరంగల్, హనుమకొండ డీఈఓలు చెప్పడం విశేషం.
తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలే కాదు విద్యాపరమైన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు (Question Papers) కూడా లీకవుతున్నాయి. అది పదో తరగతి వార్షిక పరీక్షలకు (SSC Exams) పాకిన విషయం తెలిసిందే. నిన్న తెలుగు పశ్నాపత్రం లీకవగా.. నేడు హిందీ పశ్నాపత్రం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణలో (Telangana) పదో తరగతి పరీక్షలపై నీలిమేఘాలు అలుముకున్నాయి. వరుస లీకులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా పరీక్షలు రద్దు చేయాలనే డిమాండ్ వస్తోంది.
నిన్న వికారాబాద్ జిల్లా తాండూరులో (Tandur) తెలుగు ప్రశ్నాపత్రం లీకైన విషయం తెలిసిందే. ఓ ఉపాధ్యాయ ప్రబుద్ధుడు (Govt Teacher) ఫొటోలు తీసి వాట్సప్ గ్రూపులో పెట్టేశాడు. ఏ ఉద్దేశంతో ఆయన ఇలా చేశాడో కానీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఈ లీకుల వెనుక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దాగి ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఒప్పందం చేసుకుని ఇలా ప్రశ్నాపత్రాలు బయటకు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.