అప్పట్లో అంజి సినిమా కూడా ఇదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ముందు విఐపి డైరెక్ట్ చేసిన సభాపతిని విజువల్స్ బాగా తీశాడన్న ఒకే ఒక్క కారణానికి అంజి సినిమాకి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. తర్వాత ఆయనతో వర్కవుట్ కావడం లేదని సురేష్ కృష్ణని తీసుకొచ్చారు. ఆయన కొన్ని సీన్లు తీసి ప్రాజెక్టును వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చివరికి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డికి బాగా అచ్చొచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణే టేకప్ చేయాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ అభిమానులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాటికి కారణాలు లేకపోలేదు. అందులో ఒకటి హరిహరవీరమల్లు దారుణంగా లేటయింది. ఒకే…అందరూ అర్ధం చేసుకుంటారు. కరోనా దెబ్బ కొట్టింది. తర్వాత పవర్ స్టార్ రాజకీయ ప్రస్థానం మరుగున పడి మరింత లేటయింది. ఎంత గొప్ప సినిమాకైనా టైమింగ్ చాలా ముఖ్యం. అప్పట్లో అంజి సినిమా కూడా ఇదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ముందు విఐపి డైరెక్ట్ చేసిన సభాపతిని విజువల్స్ బాగా తీశాడన్న ఒకే ఒక్క కారణానికి అంజి సినిమాకి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. తర్వాత ఆయనతో వర్కవుట్ కావడం లేదని సురేష్ కృష్ణని తీసుకొచ్చారు. ఆయన కొన్ని సీన్లు తీసి ప్రాజెక్టును వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత చివరికి నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డికి బాగా అచ్చొచ్చిన దర్శకుడు కోడి రామకృష్ణే టేకప్ చేయాల్సి వచ్చింది. దీనికి అప్పట్లో గ్రాఫిక్స్ కొత్త అయినా వాడెవడినో అమెరికానుంచి తీసుకొచ్చారు. కోట్లు కోట్లు ఖర్చయ్యాయి. లేటయింది. చివరికి సినిమా అయితే బాగా వచ్చింది. కానీ లేటే ప్రాజెక్టుగా పేరుపడి రిలీజ్కొచ్చేసరికి సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణంగా దెబ్బ తింది. ఇప్పుడదే అంజి సినిమాని కల్ట్ సినిమా అని చెప్పి, యూత్ మొత్తం తెగ ఆరాధిస్తున్నారు. చూశారా టైం ఎలిమెంట్ ఎంత పవర్ఫుల్లో.
అదే ఇప్పుడు హరిహరవీరమల్లు సినిమాకి కూడా వర్తిస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఎంత గొప్పదైనా, అప్పట్లో మెగాస్టార్ కూడా అంతే ఫవర్ఫుల్గా రాజ్యమేలుతున్నారు. కానీ అది అంజిని కాపాడుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ వైల్ఢ్ ఫైరే. కాదనడం లేదు. ఆయన సినిమా గురంచి ముఖం వాచిపోయున్నారు అభిమానులు గానీ, జనరల్ ఆడియన్స్ గానీ, పైగా రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ప్రత్యేకమైనది. అభిమానులు ఎంతగానో ప్రేమించేది. సినిమా లేటయిపోయిందన్న మేటర్ సినిమాని తీవ్రంగా దెబ్బ కొడుతుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నిజానికి అంజి వాచింగ్ వండర్. కోడిరామకృష్ణ బ్రిలియంట్ థాట్ సినిమాకి ప్రాణం పోసింది. అంజి సినిమాకి జరిగినవన్నీ హరిహరవీరమల్లుకి ప్రాప్తించాయి. ముందు క్రిష్ డైరెక్టర్, ఆయనెందుకు వెళ్ళిపోయాడో ఎవ్వరికీ తెలియనే తెలియదు. సడన్‌గా ఎగ్జిట్ అయిపోయాడు. ఆయనలా ఎగ్జిట్ అయిపోవడం రత్నం కూడా ఒక రకంగా కలిసొచ్చింది. లేకపోతే పవన్ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఎప్పుడు రావాలి? అంజి సినిమాలో మణిరత్నం చేసిన పాటలు అప్పుడే కాదు, ఇప్పటికీ అవి అద్భుతమైన మాస్ నంబర్స్. చార్ట్ బస్టర్స్. హరిహరవీరమల్లు సినిమాలో కీరవాణి చేసినవన్నీ నాసి రకంగా ఉన్నాయని అబిమానులే తల పట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో అంజికి ఎలా అయితే ఓవర్ కాస్ట్ అయిందో, ఇప్పుడు వీరమల్లుకి కూడా హద్దులు దాటి ఖర్చయింది. కాకపోతే పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి కొంత వరకూ స్కిన్ సేవ్ అవడానికి అవకాశం కనిపిస్తోంది. నార్త్ అంతా పవన్ కళ్యాణ్ హవా రాజకీయంగా సంచలనాత్మకంగానే ఉంది కాబట్టే వీరమల్లుకి అ మేరకి సపోర్ట్ రావచ్చు. అదే రత్నం కూడా మొన్న జరిగిన ఈవెంట్లో బైటపడ్డారు. హిందీ మీదే ఎక్కవ ఆధారపడుతున్నట్టుగా ధ్వనించాయి రత్నం మాటలు. చూద్దాం వీరమల్లు జాతకం ఎలాఉందో?