పొద్దున్నే నిద్ర లేవడంతోనే ప్రజలు కాఫీ, టీ, బూస్ట్ ఇలా ఎవరికి నచ్చింది వారు తాగుతారు. అయితే అధిక బరువుతో బాధపడేవారు పొద్దున్నే పరగడపున జీలకర్ర నీళ్లను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువును తగ్గించడమే కాదు.. ఇతర రకాల వ్యాధుల బారి నుంచి విముక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. గ్యాస్టిక్ ట్రబుల్, ఊబకాయం, ఉబ్బరం, కడుపునొప్పి లాంటి సమస్యలు తగ్గిపోతాయి.