SRD: కంది మండలం ఎర్దనూర్ తండా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే కిషన్ గౌడ్(42) నిద్రలో మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గురువారం రాత్రి కల్వకుంటలోని ఇంట్లో భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం 6 గంటలకు చూసేసరికి మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరయ్యారు. కుటుంబ సభ్యులను డీపీవో సాయిబాబా పరామర్శించారు.